వైద్య విద్యార్థిని పై కీచక ఘటన అనంతరం

ఢిల్లీలో 45 అత్యాచారాలు, 75 లైంగిక వేధింపుల కేసులు
న్యూఢిల్లీ: అత్యాచార ఘటనలపై దేశవ్యాప్త నిరసనలు వ్యక్తమవుతున్నా దేశ రాజధానిలో మహిళలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. గత నెలలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అనంతరం రెండు వారాల్లోనే ఢిల్లీలో 45 అత్యాచారాలు, 75 లైంగిక వేధింపుల కేసులు చోటుచేసుకున్నయి. సరాసరిగా రోజుకు మూడు అత్యాచారాలు, 5 వేధింపుల కేసులు చోటుచేసుకున్నాయి. సరాసరిగా రోజుకు మూడు అత్యాచారాలు, 5 వేధింపుల కేసులు  నమోదయ్యాయంటే దేశరాజధానిలోనే మహిళలకు ఏ మాత్రం భద్రత ఉందో అర్థమవుతోంది. 2011తో పోల్చితే 2012లో ఢిల్లీలో అత్యాచార ఘటనలు 23.43 శాతం, లైంగిక వేధింపులు 10.65 శాతం పెరిగినట్లు ఢిల్లీ పోలీసు గణాంకాలు తెలుపుతున్నాయి. 2011లో 572 అత్యాచార ఘటనలు నమోదైతే 2012లో 706 ఘటనలు చోటుచేసుకున్నాయి. 2012లో 727 లైంగిక వేధింపుల కేసులు నమోదుకాగా.. 2011లో వీటి సంఖ్య 657గా ఉంది.అత్యాచార ఘటనల్లో శిక్షపడుతున్న కేసులు జాతీయస్థాయి కంటే ఢిల్లీలోనే ఎక్కువగా ఉన్నాయి. అయితే మహిళలకు భద్రత పెంచే విషయంలో ఇంకా ఎక్కువ చర్యలు చేపట్టాల్సి ఉందని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ తెలియజేశారు.