వైసీపీ నేత షర్మిలపై పయ్యావుల ఫైర్
హైదరాబాద్: టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత షర్మిలపై టీడీపీ పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. షర్మిల పాదయాత్ర చంద్రబాబు టార్గెట్‌గా చేస్తున్న యాత్రగా ఉందని ఆయన విమర్శించారు. ” రాజన్న కూతర్ని, జగనన్న చెల్లెవ్ని” అని ఊరూరా చెప్పకుంటున్న షర్మిల బ్రదర్ అనిల్ భార్యనని ఎందుకు చెప్పకుంటలేదో స్ఫష్టం చేయాలన్నారు. అనిల్ పేరు చెబితే బయ్యారం గనుల గుట్టు బయట పడతుందనే భయమా? లేక ఇంకేమైనా కారణాలున్నాయో ప్రజలకు వివరించాలని నిలదీశారు. అసలు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు ఎవరో ముందు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆస్తులు ఎలా సంపాదించారు. అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ముందుగా వైఎస్సార్‌సీపీ నేతలు సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలు గురించి వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. దీన్ని బట్టి ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలుస్తోందని పయ్యావుల విమర్శించారు.



