వ్యవసాయ సదస్సు విజయవంతమయ్యేందుకు కృష్టి : ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: వచ్చే సంవత్సరం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు. జూబ్లీహాల్లో రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న  మార్పులు, లాభనష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.