వ్యాట్‌కు నిరసనగా వస్త్ర వ్యాపారుల ప్రదర్శన

గాంధీచౌక్‌: రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాల పై విధించిన వ్యాట్‌కు నిరసనగా శుక్రవారం ఖమ్మంలో వస్త్ర వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రదరన నిర్వహించారు. కమాన్‌ బజార్‌ నుంచి ప్రారంభమైన ప్రదర్శన స్టేషన్‌ రోడ్డు, నగరపాలక కార్యాలయం, బస్టాండ్‌ సెంటర్‌, మయూరి సెంటర్‌ మీదుగా కస్పాబజార్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న వస్త్ర వ్యాపారులు వ్యాట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షులు మురళి, కార్యదర్శి హరిహర తదితరులు పాల్గొన్నారు.