వ్యాట్‌కు వ్యతిరేకంగా గన్‌పార్క్‌లో తెదేపా ధర్నా

హైదరాబాద్‌ : వస్త్రాలపై వ్యాట్‌ను నిరసిస్తూ అసెంబ్లీ ముందు ఉన్న గన్‌పార్క్‌లో తెదేపా ధర్నా చేపట్టింది. వ్యాట్‌ ఎత్తివేసే వరకూ వష్ట్ర వ్యాపారులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. పన్నులు పెంచం అంటూనే ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం వ్యాట్‌ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం నేతలు అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు.