వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలి

కాగజ్‌నగర్‌: ప్రభుత్వం వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలంటూ వస్త్ర వ్యాపారులు చేపట్టిన ఆందోళన శనివారం కి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వివిధ సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.