శాంతి భద్రతలు కాపాడేందుకు తోడ్పడాలి : పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌: పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని, పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు అందరు తోడ్పాటునందించాలని అభ్యర్థిస్తున్నామని అన్నారు. రేపు శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఇదే తరహాలో బందోబస్తు కొనసాగుతుందని అనురాగ్‌శర్మ తెలిపారు. బ్లాక్‌డే సందర్భంగా ఈ రోజు పాతబస్తీలో 144 సెక్షన్‌ విధించిన సంగతి తెలిసిందే.