శాసనమండలి 20 నిమిషాలు వాయిదా
హైదరాబాద్ : విపక్ష సభ్యుల ఆందోళనతో శాసనమండలి 20 నిమిషాలు వాయిదా పడింది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి రద్దు చేయాలంటూ మండలిలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ్యులు పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్ మండలిని 20 నిమిషాల పాటు వాయిదా వేశారు.


