శాసనసభ ఉదయం 10 గంటలకు వాయిదా

హైదకాబాద్‌ : శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు.