శాసన సభ ఉదయం 10 గంటల వరకు వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ నాలుగో రోజు సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. స్పీకర్‌ వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో సభలో విపక్ష సభ్యులు నిరసనకు దాగారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని తెరాస, భాజపా సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. బాబ్లీపై చర్చకు తెదేపా సభ్యులు పట్టుబట్టారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు.