శ్రీలంక తమిళుల సమస్యలపై పార్లమెంటులో తీర్మానం

న్యూఢిల్లీ : శ్రీలంక తమిళుల అంశంపై పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐరాస మానవ హక్కుల సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న డిమాండుతో డీఎంకే ఈరోజు యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.