షింగేతో భేటీ కానున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ : అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈ ఉదయం 11 గంటలకు హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కలవనున్నారు. నిన్న షిండేను సీమాంధ్ర నేతలు కలిసిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై బలంగా వాదనలు వినిపించనున్నట్లు తెలంగాణ నేతలు తెలిపారు.