షిండే ప్రకటన శుభపరిణామం : సురేష్‌రెడ్డి

న్యూఢిల్లీ  : తెలంగాణ సమస్య పరిష్కారానికి నెల రోజుల్లో నిర్ణయం తెలుపుతామని హోంమత్రి షిండే ప్రకటించడం మంచి పరిణామనని అఖిలపక్ష భేటీ కాంగ్రెస్‌ ప్రతినిధి సురేష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తారనే తనకు అనిపిస్తోందని భేటీ అనంతరం మీడియాతో చెప్పారు. సమావేశం ప్రారంభం కాగానే పార్టీలన్నీ కాంగ్రెస్‌ అభిప్రాయం కోసం డిమాండ్‌ చేశాయని ఆయన తెలిపారు.