షిండే వ్యాఖ్యల పట్ల బొత్స హర్షం

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశం అనంతరం హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. సున్నితమైన తెలంగాణ అంశానికి నెలరోజుల్లోపు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న షిండే వ్యాఖ్యలను తాను బలంగా నమ్ముతున్నానని  బొత్స అన్నారు. నెలరోజుల్లోపు పరిష్కారం చూపిస్తామని చెప్పడం బట్టే ఈ అంశంపై ఇటు కాంగ్రెస్‌, అటు కేంద్రం ఎంత సీరియల్‌గా ఉన్నాయో అర్ధమవుతోందన్నారు. షిండే వ్యాఖ్యలను విశ్వసించాలి, హర్షించాలే కానీ,  కాదూ అని అపనమ్మకం ప్రరదర్శించడం భావ్యం కాదంటూ కేసీఆర్‌ను ఉదద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ మాట మార్చదని, ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిల పెట్టుకుని కాంగ్రెస్‌ వ్యవహరిస్తుందన్నారు.