సంయమనం పాటించండి

మహిళలకు పటిష్ట భద్రత కల్పిస్తాం : ప్రధాని
న్యూఢిల్లీ,డిసెంబర్‌24(జనంసాక్షి):
దేశంలో మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హావిూ ఇచ్చారు. ఆడపిల్లల తండ్రిగా తాను ఢిల్లీ ఘటనపై చింతిస్తున్నానని అన్నారు.. ఢిల్లీ ఆందోళనలు, ఘటనల నేపథ్యంలో ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించారు. బాధితురాలికి తమ కుటుంబసభ్యులు కూడా సానుభూతి తెలిపారని అన్నారు. ఘటనపై వ్యక్తిగతంగా చింతిస్తున్నా మన్నారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని తమ కుటుంబం ప్రార్థిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు బాధితురాలి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆందోళన అర్థవంతమైనదే గానీ హింసాత్మక ఘటనలు సరికాదని చెప్పారు. బాధితురాలిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, ఆందో ళనకారులు సంయమనం పాటించాలని కోరారు.ఘటనపై తాను వ్యక్తిగ తంగా చింతిస్తున్నామని చెప్పారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానన్నారు. ప్రజల ఆందోళన అర్థవంతమైనదే గానీ హింసాత్మకమే సరికాదన్నారు. బాధితారులని, వారి కుటు-ంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హింసతో సాధించేదేవిూ లేదని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సోమవారం ఆందోళనకారులకు
పిలుపునిచ్చారు. గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులతో తగాదా భవిష్యత్తుకు మంచిది కాదని సూచించారు. మహిళలకు మరింత పటిష్ట భద్రతను ఏర్పాటు- చేస్తామని చెప్పారు. ఆందోళనలు హింసాత్మకం మారడం సరికాదన్నారు. బాధితురాలు కుటుంబానికి తాము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఆందోళనకారులు దయచేసి సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఐ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ ఆందోళనకారులతో మాట్లాడిన విషయం తెలిసిందే. గ్యాంగ్‌ రేప్‌ ఘటన ఢిల్లీలో వారం రోజులుగా చర్చనీయాంశమైంది. నిందితులను శిక్షించాలని ఆందోళనకారులు రోడ్డెక్కారు. ఆదివారం సోనియా, రాహుల్‌ గాంధీలు ఆందోళనకారులకు హావిూ ఇచ్చారు. మేము విూతో ఉన్నామని… న్యాయం జరిగేలా చూస్తామని వారికి శనివారం అర్ధరాత్రి హావిూ ఇచ్చారు. 10 జనపథ్‌లోని తన ఇంటి నుండి
బయటకు వచ్చిన సోనియా కింద కూర్చొని మాట్లాడారు. తాను విూతో ఉన్నానని, ఎప్పటిలోగా న్యాయం చేయగలమో చెప్పలేమని అయితే న్యాయం మాత్రం తప్పకుండా చేస్తామని, అందుకోసం మేం ప్రయత్నాలు చేస్తున్నామని సోనియా ఆందోళనకారులతో చెప్పినట్లు-గా తెలుస్తోంది. ఆందోళనకారులు సోనియా గాంధీకి డెడ్‌ లైన్‌ పెట్టగా.. డైడ్‌ లైన్‌ లాంటివేవీ లేవని.. అయితే కఠిన చర్యలు మాత్రం తీసుకుంటామని హావిూ ఇచ్చారు. ఆదివారం కూడా ఆందోళనకారులు ఢిల్లీ రోడ్ల పైకెక్కారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళనకారులు మెట్రో రైలు గేట్ల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఆదివారం పటేల్‌ చౌక్‌, సెంట్రల్‌ సెక్రటరియేట్‌, ఉద్యోగ్‌ భవన్‌, రేసు కోర్సు తదితర ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్స్‌ మూతపడ్డాయి.
మరోవైపు బాధితురాలికి మద్దతుగా దేశ రాజధానిలో ఈ రోజు కూడా నిరసనలకు పెద్దసంఖ్యలు విద్యార్థులు, మహిళాసంఘాలు సిద్ధమయ్యారు. కాగా ఈ ఘటనపై విచారణ వ్యక్తపరుస్తూ క్షమాపణ చెప్పిన ప్రభుత్వం ఇండియాగేట్‌ వద్ద నిరసనలకు అనుమతిని నిరాకరించింది. ఆందోళనలు ఉధృతమవుతున్న తరుణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు- చేశారు.
ఇండియాగేట్‌, రాజీవ్‌చౌక్‌ తదితర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. భారీగా పోలీసులు మోహరించాయి. ఇండియాగేట్‌ పరిసర ప్రాంతాల్లోని 10 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ముందుజాగ్రత్త చర్యగా వివిధ ప్రాంతాల్లో కర్ఫ్యూ, 144 సెక్షన్లను విధించారు. అయినా అక్కడే నిరసన తెలుపుతామని నిరసనకారులు తేల్చిచెప్పారు.