సఖి-సహేలీ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

సైదాబాద్‌: సైదాబాద్‌ పాత గడ్డిఅన్నారంలోని సామాజిక భవనంలో రెండు రోజులపాటు కొనసాగే కిశోర బాలికల సఖి-సహేలీ శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. మాదన్నపేట ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి హిమబిందు, ఐసీడీఎన్‌ మలక్‌పేట ప్రాజెక్టు సీపీడీవో ప్రజ్వల, పర్యవేక్షకురాలు సావిత్రి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిశోర బాలికలు ఎదుర్కొనే సమస్యలు, న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, సమతుల్యమైన పౌష్టికాహారం అలవాటు చేసుకోవాలని వారికి సూచించారు.