సనత్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలో అగ్ని ప్రమాదం

అమీర్‌పేట, హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలో కేకే రెసిడెన్సీలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనం సెల్లార్‌ నుంచి మంటలు చెలరేగి పైఅంతస్తులకు వ్యాపించాయి. దీంతో మొదటి మూడు అంతస్తుల్లో ఉన్నవారు భయంతో కిందికి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో సెల్లార్‌లో పార్క్‌ చేసిన 15 ద్విచక్రవాహనాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.