సమరభేరికి సన్నద్ధమైన సూర్యాపేట
హైదరాబాద్ : లోక్‌సభకు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ పార్టీ లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానేటీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సమరభేరి మోగించేందుకు సమయాత్తం అయింది. తెలంగాణ సమరభేరి పేరిట భారీ ఎత్తున బహిరంగసభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి. సూర్యాపేటలోని ఇందిరానగర్ కాలనీ వద్ద 40 ఎకరాల స్థలంలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తిచేశారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ విరుచుకుపడతారని భావిస్తున్నారు.



