సమరభేరికి హాజరుకానున్న కేసీఆర్‌

హైదరాబాద్‌ : సూర్యపేట పట్టణం గులాబీమయమైందిపార్టీ జెండాలు, ఫ్లెక్సీలు,బ్యానర్లతో పట్టణం గులాబీ రంగులీనుతుంది. తెలంగాణ పల్లెలు సూర్యాపేట వయనమయ్యాయి. గులాబీ పార్టీ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు జరుగనున్న భారీ బహిరంగ సభకు  అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ‘ సమరభేరి’ సభకు టీఆర్‌ఎస్‌ అధినేత, గులాబీ బాస్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జరుగనున్న సభకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సభకు ఏర్పాట్లు పూర్తి

ఇందిరమ్మ కాలనీలోని సుమారు 50 ఎకరాల స్థలంలో సభా ప్రాంగాణాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి మంది కూర్చునేలా సభావేదికను నిర్మించారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు. సభకు వెళ్లే వాహనాలను తప్పా మిగతా వాహనాలనే దారి మళ్లిస్తున్నారు. సభకు వచ్చే వాహనాలను  నిలుపడానికి ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. సభ సాయంత్రం జరుగనున్నా తెల్లవారుజాము నుంచే ప్రజలు సభాస్థలికి రావడం ప్రారంభమైంది. ఈ సభకు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. సుమారు ఐదు లక్షల మందికి పైగా తెలంగాణ వాదులు హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు.