సమాచారచట్టం వేదిక అధ్యక్షుడు మృతి
విజయనగరం, జూలై 30 : సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక అధ్యక్షుడు కె.రాఘవేంద్రరావు (75) మృతి చెందారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాఘవేంద్రరావు మృతిపై సమాచార రక్షణ వేదిక సభ్యులు చందక లక్ష్మణ, శ్రీనివాసరావు, మీసాల రామునాయుడు, ఒమ్మి మాజీ సర్పంచ్ అంబళ్ళ అప్పలనాయుడు, రాఘవేంద్రరావు సంతాపం తెలిపారు.