సముద్రంలో మునిగి బీటెక్‌ విద్యార్ధి మృతి

ఎన్‌. రాయవరం: విశాఖ జిల్లాఎన్‌. రాయవరం మండలంలోని రేపు పోలవరం వద్ద సముద్రంలో మునిగి  బీటెక్‌ విద్యార్ధి మృత్యువాడ పడ్డారు. మృతుడిని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వెంకటకృష్ణగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా తుని శ్రీ ప్రకాష్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వెంకటకృష్ణ తన స్నేహితులతో కలిసి సముద్రంలో స్నానానికని ఎన్‌. రాయవరం వచ్చాడు. సముద్రంలో దిగిన తరువాత అలల తాకిడికి ప్రమాదవశాత్తూ సముద్రంలో కొట్టుకుపోయి మృతిచెందాడు.