సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని ఆన్యాయం :హరీష్‌రావు
హైదరాబాద్: రాష్ట్రం ఒక్కటే ..సీఎం ఒక్కడే ..కాని తెలంగాణ ప్రాంతం మాత్రం నష్టపోతుందని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణలో వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్డు మీద పడితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్లు ఉందని ఆయన విమర్శించారు. సీమాంద్రలో తుపాన్ వస్తే హెలికాప్టర్ ల పోయి పర్యవేక్షించే ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణలో వడగండ్ల నష్టాన్ని ఎందుకు పర్యవేక్షించరు. అని ఆయన ప్రశ్నించారు.రాష్ట్రంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఇన్ని పరిణామాలు జరుగుతున్న తెలంగాణ మంత్రులు ,ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. సీమాంద్రకు 7 గంటలు కరెంటు సరాఫరా చేస్తూ తెలంగాణకు మాత్రం మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడం బట్టి చూస్తే సీమాంద్ర సర్కారుకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్ధమౌతుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతంపై ఇంత వివక్ష జరుగుతున్నందు వల్లే తాము తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నామని ఆయన పేర్కోన్నారు.


