సర్‌ఛార్జీలను పెంచితే ఊరుకోం: హరీష్‌రావు
హైదరాబాద్: ప్రభుత్వం మరోసారి సర్‌ఛార్జీలను పెంచితే ఊరుకోమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. ఇవాళ ఆయన ఈఆర్‌సీ కార్యాలయంలో జరిగిన బహిరంగ చర్చలో పాల్గొన్నారు. మరో రూ. 90 కోట్ల సర్‌ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందుకే ఇప్పుడు బహిరంగ విచారణ పేరుతో విచారణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డిస్కం, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆయన దుయ్యబట్టారు.మావాదనలను ఈఆర్‌సీ పట్టించుకోవడంలేదని ఈఆర్‌సీపై ప్రజలే దాడి చేసే రోజు వస్తుందని హెచ్చరించారు.



