సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి

share on facebook

వైద్యాధికారుల సవిూక్షలో మంత్రి హరీష్‌
ఆదిలాబాద్‌,మార్చి4(జనం సాక్షి): సర్కార్‌ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంత్రి సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దవాఖానకి వచ్చే రోగులకు స్థానికంగా వైద్యం అందించాలన్నారు. రెఫరల్‌ కేసులు తగ్గించాలని వైద్యులకు సూచించారు. పేదలకు వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Other News

Comments are closed.