సింగరేణి ఆవిర్భావ వేడుకలు

గోదావరిఖని : సింగరేణి 124 ఆవిర్భావ వేడుకలను కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని బొగ్గుగనులు, విభాగాల్లో సింగరేణి జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. సింగరేణి చరిత్రను కార్మికులకు వివరించారు. జీఎం కిషన్‌రావు తన కార్యాలయంలో జెండా ఎగురవేసి ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు.