సికింద్రాబాద్ సర్కిల్ కి రాంకీ ద్వారా కొత్త చెత్త తరలింపు డబ్బాలను ఆవిష్కరించిన ఉప సభాపతి
సికింద్రాబాద్ (జనం సాక్షి ): సికింద్రాబాద్ ను చెత్త రహిత ప్రాంతంగా, పరిశుభ్రత కలిగిన ప్రదేశంగా తీర్చి , అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. జీ హెచ్ ఎం సీ సికింద్రాబాద్ సర్కిల్ కి రాంకీ ద్వారా సమకూరిన కొత్త చెత్త తరలింపు డబ్బాలను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ శనివారం లాంచనంగా ఆవిష్కరించి, పారిశుధ్య సిబ్బందికి అందించారు. సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు నిరంతరం సేవలను అందిస్తున్నారని ప్రశంసించారు. వైద్యాధికారి డాక్టర్ రవీందర్ తో పాటు అధికారులు, నేతలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలోని దాదాపు 17 4 బృందాలకు ఈ కొత్త డబ్బాలను అందించాలని, స్థానిక కార్పొరేటర్ లను సమన్వయము చేసుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.