సిమెంటు ధర తగ్గించాల్సిందే! సిమెంటు ధర తగ్గించాల్సిందే!

కడప, ఆగస్టు 3 : జిల్లాలో సిమెంటు ధరను తక్షణం తగ్గించకపోతే సిమెంటు రవాణా లారీలను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దనరెడ్డి ప్రకటించారు. సిమెంటు ధరల తగ్గింపుపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని చెప్పారు. వారంలోగా ధరలను తగ్గిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. సిమెంటు ఫ్యాక్టరీల యాజమాన్యం ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపారని అన్నారు. ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు దీక్షను విరమింపజేశారని చెప్పారు. అయితే గడువు దాటిపోయినా ధరలు తగ్గించకపోవడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలా చేయని పక్షంలో జిల్లాలో సిమెంటు రవాణా లారీలను ఎక్కడికక్కడే అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.