సిరిపూర్ తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు ముగింపు.

– సర్పంచ్ గోవింద్ నాయక్.

మల్లాపూర్, (జనం సాక్షి) సెప్టెంబర్: 02 రోజున సిరిపూర్ తండాలో తీజ్ ఉత్సవాలు రాత్రి ఘనంగా జరిగాయి. అని సిరిపూర్ సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంజారాల పండుగలలో అతి ముఖ్యమైది తీజ్ ఉత్సవాలు అని ఈ పండుగ వివాహం కానీ ఆడపడుచులు యువతులు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటూ పవిత్రమైన గోధుమ నారు పోసి కొత్త బుట్టలో ఉంచి సంప్రదాయ దేవుళ్ల ను మొక్కులు చెల్లించి మూడు పుటలు నీరు పోసి పెళ్లి కాని అమ్మాయి లు వారి కుటుంబం లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని పడి పంటలు బాగా ఉండాలని మంచి దిగుబడి రావాలని ,పశువులు బాగుండాలని పశు సంపద పెరగాలని , విద్య జ్ఞానము అందరికి రావాలని, మంచి భర్త రావాలని కోరుకుంటారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్ గారు సంప్రదాయ బద్దంగా బోగ్ బండారు ,నైవేద్యం అమ్మవార్లను సమర్పించి సిరిపూర్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వేడుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్,జగో బంజారా మరో నంగారా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నునావత్ రాజు,బంజారా నాయకులు బాధవత్ రాము నాయక్,నునావత్ రాజు నాయక్ ,తిరుపతి నాయక్, వినోద్ నాయక్,భూక్య తిరుపతి నాయక్,సభవాట్ మల్లేష్, సభవాట్ గంగాధర్ నాయక్, భూక్య ప్రమీల , సభవాట్ శిలా , బాధవత్ సునీత , లింబు నాయక్,దేశాయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.