సీఎంపై మంత్రి రామచంద్రయ్య ఫైర్‌

హైదరాబాద్‌ : కరెంట్‌ ఛార్జీల పెంపు వ్యవహరంలో మంత్రి రామచంద్రయ్య సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పై ఫైర్‌ అయ్యారు. సీఎంకు తెలువకుండానే ఈఆర్సీ ఛార్జీలు పెంచుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఛార్జీలను పెంచడం దారుణమని మంత్రి రామచంద్రయ్య అన్నారు.