సీనియర్‌ మంత్రులతో బొత్స భేటీ

హైదరాబాద్‌ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శాసనసభ ప్రాంగణంలో సీనియర్‌ మంత్రులతో భేటీ అయ్యారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం, ధిక్కార ఎమ్మెల్యేల వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన సారాంశాన్ని బొత్స మంత్రులకు వివరించనున్నారు.