సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును కలిసిన :కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: తెలంగాణ .జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును కలుసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వాలని ఆయనను కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.



