‘సీబీఐ భయంతోనే సర్కార్‌కు బాబు మద్దతు’
రాజమండ్రి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బొడ్డు భాస్కర రామారావు మండిపడ్డారు. తనపై సీబీఐ విచారణ జరిపిస్తారనే భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం ఉన్నందునే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదని బొడ్డు భాస్కర రామారావు వ్యాఖ్యానించారు. బాబు పాదయాత్రతో ప్రజలకు ఒరిగేది ఏమీలేదని ఆయన పెదవి విరిచారు.


