‘సీమాంధ్రకోన్యాయం.. తెలంగాణకోన్యాయమా?’

హైదరాబాద్‌: ప్రభుత్వం తెలంగాణవాదులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన సీమాంధ్ర కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేసిన ప్రభుత్వం తెలంగాణ న్యాయవాదులపై పెట్టిన కేసులు ఎందుకు ఎత్తివేడయం లేదని ప్రశ్నించారు. వారికో న్యాయం, తమకో న్యాయమా అని ప్రశ్నించారు. తమ వాటా కోసం పోరాడిన 24 మంది తెలంగాణ న్యాయవాదులపై కేసులు నమోదు చేశారని తెలిపారు. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ న్యాయవాదులపై కేసులు నమోదు చేశారని తెలిపారు. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ న్యాయవాదులపై టీడీపీ గుండాలు దాడి చేస్తే ఆ కేసులు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మాన ప్రసాదరావు పై ప్రాసిక్యూషన్‌ చేయొద్దన్న ప్రభుత్వం న్యాయవాదులను ఏ  విధంగా ప్రాసిక్యూషన్‌ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ న్యాయవాదుల ప్రాసిక్యూషన్‌పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.