సీమాంధ్రలకెంత కండకావరం

తెలంగాణవాదులను దేశ ద్రోహులంటున్నరు..

విభజనకారులని తిడుతున్నరు
ప్రత్యేక రాష్ట్ర కోరిక తెలంగాణలో లేనే లేదట !
వైజాగ్‌లో సీమాంధ్ర జేఏసీ బూటకపు నిరసన.. చిన్నారులు తప్ప కనిపించని జనం
సీమాంధ్ర జేఏసీపై తెలంగాణవాదుల ఫైర్‌
తెలంగాణవాదులను ద్రోహులంటే..
సీమాంధ్రులు కూడా ద్రోహులే
మద్రాసు నుంచి విడిపోయిన సంగతిని మరిచారని ఆగ్రహం
హైదరాబాద్‌, అక్టోబర్‌ 10(జనంసాక్షి): సీమాం ధ్రులు మరోసారి తెలంగాణ ఉద్యమంపై తమలో దాచుకున్న విషాన్ని కక్కేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమిస్తున్న తెలంగాణవాదులను దేశ ద్రోహులని, విభజనకారులని తిట్టి పోశారు. ప్రత్యేక రాష్ట్ర కోరిక తెలంగాణలో లేనే లేదని పక్కా అబద్ధాలను ప్రజాముఖంగా చెప్పుకొ చ్చారు. తెలం గాణ వద్దని, సమైకాంధ్రే ముద్దని ఓ బూటకపు నిరసనను తెలిపారు. ఈ నాట కమంతా విశాఖపట్నంలోని సీతంపేట జంక్షన్‌లో బుధవారం జరి గింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు తెలంగాణ ఉద్యమ జేఏసీని చూసి, సీమాంధ్రులు కూడా ఓ జేఏసీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. మొన్న రాష్ట్ర రాజ ధాని నడిబొడ్డున తెలంగాణ మార్చ్‌ విజయ వంతంతో ఎటూపాలు పోని సమైక్యవాదులు, ఎక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చేస్తుందో, ఎక్కడ తమ దోపిడీ ఆగిపోతుం దోనని తిండీతిప్పలు మానేసి కుతంత్రాలకు వ్యూ హాలు రచిస్తున్నారు. తాము సీమాంధ్రలో సాగిసు ్తన్న కృత్రిమ ఉద్యమానికి, తమ చెప్పు చేతల్లో ఉన్న సీమాంధ్ర జేఏసీని ఎగేశారు. సమై క్యాంధ్రకు మద్దతుగా నిరసనలు చేపట్టాలని వాళ్ల జేబుతు నింపేశారు. డబ్బుల గలగల ఇచ్చిన ఉత్సాహంతో తమ పబ్బం గడుపుకోవడానికి సీమాంధ్ర జేఏసీ కూడా మరో కృత్రిమ ఉద్య మానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగం గానే బుధవారం తెలం గాణ వద్దు.. సమైక్యాంధ్రే ముద్దు అని ముద్రించి ఉన్న ప్లకార్డులతో వైజా గ్‌లోని సీతంపేట జంక్షన్‌ దగ్గర ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీమాం ధ్ర జేఏసీ నాయకుల్లో ఒకడైన కిశోర్‌ మాటా డుతూ తెలంగాణవాదులను విభజనకారులని, దేశ ద్రోహులని తన అక్కసు వెల్లగక్కాడు. తెలం గాణలో అసలు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష లేనే లేదని పచ్చి అబద్ధాలను అక్కడి ప్రజలకు నూరిపోశాడు. ఇదిలా ఉంటే ఈ బూటకపు ఉద్యమానికి జనం పెద్దగా స్పందించలేదు. ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు. తమ అనుచరగణంతోపాటు ఎంతో కొంత మంది ఉండాలి కాబట్టి సీమాంధ్ర జేఏసీ నాయకులు విద్యార్థులను ధర్నాకు తరలించారు. వారి చేతికి తెలంగాణ వ్యతిరేక ప్లకార్డులిచ్చి నినాదాలు చేయించారు. ఇదిలా ఉంటే, సీమాంధ్ర జేఏసీ చేసిన ఈ అబద్ధపు నిరసనపై, తెలంగాణ ఉద్యమకారులను దేశ ద్రోహులని తిట్టడంపై తెలంగాణవాదులు, ప్రజలు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులను దేశ ద్రోహులంటే, సీమాంధ్రులు తమను తాము తిట్టుకున్నట్లేనని ఎద్దేవా చేస్తున్నారు. సీమాంధ్రులు కూడా ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయారన్న సంగతిని తెలుసుకోవాలన్నారు. నాడు ఆంధ్రులు ఉద్యమిస్తే దేశ భక్తి, నేడు తెలంగాణవాదులు ఉద్యమిస్తే దేశ ద్రోహమా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకెన్నాళ్లు తెలంగాణను దోచుకుంటారని నిలదీస్తున్నారు. సీమాంధ్ర జేఏసీ నాయకులు ఇలాంటి కవ్వింపు చర్యలను మానుకోవాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు..