‘సీమాంధ్ర నేతల వ్యాఖ్యలు సరికాదు’

హైదరాబాద్‌ : తెలంగాణకు చరిత్రే లేదనట్లుగా సీమాంద్ర నేతలు మాట్లాడటం సరికాదని ఎమ్మెల్సీ ఆమోన్‌ అన్నారు. అలాంటి వ్యాఖ్యల వల్లే తెలంగాణలో ఆత్మహత్యాలు పెరుగుతున్నారు. తెలుగు ప్రజలు ఏనాడూ ఒకే ప్రాంతంగా ఐక్యంగా లేదనేది చారిత్రక సత్యమన్నారు. ఈ చారిత్రక వాస్తవాలతోనే ‘ది మిట్‌ ఆఫ్‌ తెలుగు యూనిటీ’ అనే పుస్తకాన్ని వెలువరించామన్నారు. సీమాంధ్ర నేతలు తమ ప్రాంతంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణపై మాట్లాడి ప్రజలను గందరగోళంలో పడేయొద్దని కోరారు.