సునీల్‌ మిట్టల్‌కు కోర్టు సమన్లు

ఢిల్లీ : అదనపు స్పెక్ట్రం కేటాయింపుల కేసులో భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ రవి రుయా, టెలికాం మాజీ కార్యదర్శి శ్యామల్‌ ఘోష్‌, మరో సంస్థలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 11న కోర్టులో హాజరు కావాలని ఈ సమన్లలో పేర్కొంది.