సుపరిపాలనపై లోక్‌సత్తా రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌: సుపరిపాలన, సురాజ్య సాధన దిశగా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు లోక్‌సత్తా సిద్ధమైంది. దీనిలో భాగంగా సుపరిపాలనకు అవరోధంగా మారిన పలు అంశాలపై చర్చంచేందుకు ఇవాళ హైదరాబాద్‌లో ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌, పలువురు నాయకులు హాజరయ్యారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసుకోనిదే సుపరిపాలన సాధ్యం కాదని సమావేశంలో పాల్గొన్నా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.