సూర్యాపేటకు చేరుకుంటున్న తెలంగాణవాదులు
సూర్యాపేట: తెరాస ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమరభేరి కోసం తెరాస శ్రేణులు. తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో నల్గొండ జిల్లా సూర్యాపేటకు చేరుకుంటున్నారు. తెరాస జెండాలు, బ్యానర్లతో పట్టణం గులాబీ మయమైంది. 40 ఎకరాల విస్తీర్ణంలో స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణానికి తెలంగాణ పోరాట యోధుడు బండియాదగిరి ప్రాంగణంగా నామకరణంగా నామకరణం చేశారు. మరోవైపు నేటి సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 20 మంది ఎస్సెలు, 800 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.



