సెప్టెంబరు 30తేదీన తెలంగాణ మార్చ్‌ను నిర్వహిస్తాం : ఈటెల

హైదరాబాద్‌: తెలంగాణాపై ఏకాభిప్రాయం లేదన్న ప్రధానమంత్రి మాటలు అర్థరహితమని తెరాసా నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. 121 కోట్ల భారతీయుల ఏకాభిప్రాయంతోనే మన్మోహన్‌ ప్రధని అయ్యారా అని ప్రశ్నించారు. తెలంగాణా ఉద్యోగ సంఘాల పనరంకిత దీక్షలను ఈటెల రాజేందర్‌ విరమింపజేశారు. 42 రోజుల సకల జనుల సమ్మెకు ఈ రోజుతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస తెలంగాణవ్యాప్తంగా పునరంకిత దీక్షలు నిర్వహించింది. అందులో భాగంగా ఇందిరాపార్కు వద్ద హైదరాబాద్‌ – రంగారెడ్డి జిల్లాల ఉద్యోగులతో పనరంకిత దీక్షను ఉద్యోగ సంఘాల ఐకాస నిర్వహించింది. దీన్ని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ప్రారంభించారు. గాంధీజీ దండ యాత్రను నిర్వహించిన రీతిలోనే సెప్టెంబరు 30వతేదీన తెలంగాణ మార్చ్‌ను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.