సెహ్వాగ్‌ దూకుడు

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో సెహ్వాగ్‌ రెచ్చిపోయాడు. వన్డే మ్యాచ్‌ను తలపిస్తూ ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. వరుసగా విఫలమవుతున్న సెహ్వాగ్‌, గంభీర్‌ జోడి ఈ మ్యాచ్‌లో నిలకడగా ఆడుతోంది. మొదటి రోజు లంచ్‌ విరామానికి భారత్‌ 28 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. సెహ్వగ్‌ 66 బంతులో 79 పరుగులు చేయగా ,, ఆచితూచి ఆడుతున్న గంభీర్‌ 103 బంతుల్లో 37 పరుగులు చేశాడు.