సేవల ఆధారంగా గ్యాస్‌ ఏజెన్సీలకు రేటింగ్‌లు : పనబాక

గుంటూరు: లక్ష్య పథకం కింద దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి గ్యాస్‌ పోర్టబులిటీ అమలు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో గ్యాస్‌ పోర్టబులిటీ ప్రయోగాత్మకంగా అమలవుతోందని చెప్పారు. వినియోగదారులకు అందిస్తున్న సేవల ఆధారంగా గ్యాస్‌ ఏజెన్సీలకు రేటింగ్‌లు ఇస్తామని తెలియజేశారు.