సొసైటీల ద్వారా గిరిక తాళ్ల పెంపకం – తాడి టాపర్ రాష్ట్ర చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్
గీత కార్మికుల సొసైటీల ద్వారా గిరిక తాళ్ళను పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర తాడి టాపర్ చైర్మన్ పల్లె రవికుమార్ అన్నారు. శుక్రవారం రామగిరి మండలంలో ఎంపీపీ ఆ రెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. 560 జి ఓ పరంగా ఎవరైతే సొసైటీలకు 5 ఎకరాల భూమి ఉందో ఆ భూములకు చుట్టు పెన్సింగ్ వేసి గిరిక తాళ్లు ఈత చెట్లు ఒక బోరు మోటరు వేయడం కోసం కేసీఆర్ తోని చర్చలు జరిపినమని అన్నారు. త్వరలోనే కేసీఆర్ గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందియనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారనితాడి టాపర్ చైర్మన్ రవి కుమార్ గౌడ్ తెలిపారు.రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పల్లె రావికుమార్ గౌడ్ ని సన్మానించిన రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్, తాళ్ళపల్లి విష్ణు గౌడ్, దాసరి చంద్రమోళి గౌడ్, తోడేటి శివకుమార్ గౌడ్, బిల్లా కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.