సోనియా గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం

రాజ్‌కోట్‌: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గుజరాత్‌లో ఆ రాష్ట్ర విధానసభ ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించారు. భాజపా రాష్ట్రాల్లోనే అవినీతి అధికంగా ఉందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. తన వైద్యఖర్చులపై మోడీ చేస్తున్న విమర్శలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.