స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు : ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: స్థానిక సంస్థలకు 2001 జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందకు ప్రభుత్వం చర్యలు చేపడేతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. 2011 జనాభా లెక్కలు అందు బాటులోకి వచ్చేందుకు కచ్చితమైన సమయం తెలియ నందున దీనిపై తాము గతంలో న్యాయ స్థానంలో దాఖలాలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు వివరించారు. ఇవాళ శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లడుతూ ఆయన రాజ్యాంగాన్ని నిర్దేశిస్తున్న ప్రకారం జరగాల్సిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం రిజర్వేషనేకల కాపాడేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లిందన్నారు. వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్‌ ఆ రంగంపై దృష్టి నిలిపేందుకు తోడ్పడుతుందన్నారు. రాష్ట్రనికి నీలం తుఫాను మిగిల్చిన నష్టాన్ని కేంద్రానికి నివేదిక ఇస్తు మూడున్నర కోట్ల రూపాయల సాయం అర్ధిస్తే కేవలం 430 కోట్లను మాత్రమే విదల్చడం, పొరుగున ఉన్న మహరాష్ట్రకు భారీగా సాయం అదించడం పై విమర్శలను ఆయన కొట్టి పడేశారు. ఇందిరమ్మ బాటకు ఇటీవల వరుసగా వస్తున్న ఎన్నికల కోడ్‌, ఇతరత్రా అంశాలు అవరోధాలుగా ఉన్నాయని, త్వరలోనే దీనిని కొనసాగిస్తానన్నారు.

తాజావార్తలు