స్పీకర్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల లేఖ
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద తమను పోలీసులు అడ్డుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాజయ్య, మధుయాస్కీ, వివేక్‌లు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు. తమ హక్కులకు భంగం కలిగేలా ముఖ్యమంత్రి వ్యవహరించారని వారు తమ లేఖలో పేర్కొన్నారు.



