హకీంపేటలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మహిళా టోర్నమెంట్‌

శామీర్‌పేట: రంగారెడ్డి జిల్లా హకీంపేటలోని రాష్ట్ర క్రీడా పాఠశాలలో రాష్ట్ర స్థాయి మహిళల టోర్నమెంట్‌ను డాక్టర్‌ కె. నర్సయ్య ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 23 జిల్లాలనుంచి 234 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 30 మంది అధికారులు ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ క్రీడలలో గెలిచిన వారిని జాతీయ స్థాయి జట్టుకు  ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారు నవంబర్‌ 2 నుంచి 5 వరకు హర్యానా రాష్ట్రంలోని గూర్గావ్‌లో జరిగే జాతీయ స్థాయి మహిళా పోటీలకు హాజరవుతారు.