హరీశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్‌

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెళ్లారు. హరీశ్వర్‌రెడ్డిని కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. అయితే హరీశ్వర్‌రెడ్డి మాత్రం పరిగిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హరీశ్వర్‌రెడ్డి బాటలోనే ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి కూడా నడవనున్నట్లు సమాచారం.