హర్యానా మాజీ సీఎంను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాను ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో చౌతాలాతో సహా ఆయన తనయుడు, ఎమ్మెల్యే అభయ్ చౌతాలాతో పాటు 53 మందిని దోషులుగా తేల్చింది. దీంతో మాజీ సీఎంతో పాటు మిగతా వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో శిక్షను కోర్టు ఈ నెల 22న ఖరారు చేయనుంది. 1999-2000 సంవత్సరంతో రాష్ట్రంలో చేపట్టిన 3,206 జూనియర్ బేసిక్ శిక్షణ ఉపాధ్యాయుల నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టి జూన్ 6,2008లో ఛార్జిషీట్ దాఖలు చేసింది.