హర్షారెడ్డి కిడ్నాప్‌ కేసులో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డి కిడ్నాప్‌ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టుచేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. డబ్బుల కోసమే హర్షారెడ్డిని అపహరించారని, బంధువు శ్రీనివాస్‌రెడ్డి ఇందులో ప్రధాన సూత్రధారని పోలీసులు వెల్లడించారు. ఈకేసులో శ్రీనివాస్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్గారెడ్డి, శివయ్యను అరెస్ట్‌ చేశామని, రాజు మరోవ్యక్తి పరారీలో ఉన్నారని హైదరాబాద్‌ తూర్పు మండలం డీసీపీ గంగాధర్‌ తెలిపారు.