హిందీ భాష అనేది సామాజిక, సంస్కృతిక ఐక్యతకు గర్తు: ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భాష అనేది వారధిలాంటిదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ, ప్రాంతీయ భాషలను ఉపయోగించాలని సూచించారు. శుక్రవారం హిందీ డే సందర్భంగా హిందీ భాష ప్రచారంలో భాగంగా 50 ప్రభుత్వ విభాగాలకు ఆయన అవార్డులు బహూకరించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అదేవిధంగా హిందీ భాష అనేది సామాజికి, సంస్కృతిక ఐక్యతకు గుర్తు అని అన్నారు.



